Saturday, October 15, 2011

Panjaa Audio to be Released in a Month

పవన్‌కల్యాణ్ ’పంజా’ ఆడియో కోసం ఇంకో నెల

 
Twitter message by Panjaa Producer 
Shobu_ Shobu Yarlagadda
@Raja_Yuvan just heard the latest no. Love it! Thanks for giving another great song! 
పవన్‌కల్యాణ్ ’పంజా’ ఆడియో కోసం ఇంకో నెల, సినిమా కోసం ఇంకో రెండు నెలలు వెయిట్ చెయ్యాలి. ఇప్పుడు అభిమానులలో మాత్రమే అంచనాలు కలిగిన ఈ సినిమా, ఆడియో రిలీజ్ అయ్యాక విపరీతమైన హైప్ రావడం ఖాయం. నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్స్ ప్రకారం ఆడియో బాగా వచ్చినట్టే. ’యువన్ శంకర్ రాజా’ ఫస్ట్ టైం పవన్‌కల్యాణ్‌కు మ్యూజిక్ అందిస్తున్నాడు కాబట్టి పవన్‌కల్యాణ్ 'జల్సా' లాంటి సన్ససేషనల్ ఆడియో ఎక్సపెట్ చేయవచ్చు.

ఆడియో వచ్చే లోపల ఎదురుచూసేవి స్టిల్స్ మరియు ట్రైలర్స్. ట్రైలర్స్ దీపావళికి అని నిర్మాతలు చెప్పారు. సో ఇక మిగిలింది స్టిల్స్. మొన్నటి స్టిల్ చూసాక సినిమా కోసం రెండు నెలలు ఆగడం కష్టం అనుకున్నాను. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన స్టిల్స్‌ను బట్టి కచ్చితంగా ఒక కొత్త రకమైన సినిమా చూస్తాం అన్న ఫీలింగ్ వచ్చింది.

కొద్దిగా లేటు అయినా, నెక్స్ట్ బంచ్ మాత్రం, సేమ్ ఫీల్‍‌తో కాకుండా, పవన్‌కల్యాణ్ ’పంజా’ ఎటువంటి సినిమానో మరికొంత రివీల్ చేసే విధంగా వుంటే బెటర్. బాదంతా కలక్షన్స్ కోసం అల్లు అర్జున్ ’వరుడు’ ’బద్రీనాథ్’ మాదిరి ఎక్కడ రాంగ్ పబ్లిసిటి చేసి రాంగ్ ఎక్సపేటేషన్స్ బిల్డ్ చేస్తారేమోనని భయం.

0 comments:

Post a Comment