Now its time for Pawankalyan Panjaa
పవన్‌కల్యాణ్ సినిమాలకు భారీ రిలీజ్, భారీ ఓపినింగ్స్ కొత్త కాదు. పవన్ అభిమానులు "మా ప్లాఫ్ సినిమా ఓపినింగ్ కలక్షన్స్ అంత లేవు మీ హిరో హిట్ సినిమా కలక్షన్స్" అని వేరే అభిమానులతో వాదించడం జరుగుతూ వుంటుంది. జల్సా తర్వాత వచ్చిన పవన్‌కల్యాణ్ సినిమాలు ఓవరాల్ కలక్షన్స్ తో బొల్తా పడ్డాయి. తీన్‌మార్ క్లాస్ సబ్జక్ట్ మూలంగా ఓపినింగ్స్ లో కూడా వెనుకబడిందంటారు.
"ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చెయ్యాలంటే ముందు హిరోకు స్టామినా వుండాలి. దానికి మంచి సబ్జక్ట్ తోడయ్యితే భారీ ఓపినింగ్స్ వస్తాయి. భారీ రిలీజ్ వలన ఎంత ఎడ్వాంటేజ్ వుందో, అంతే రిస్క్ వుంది. తేడా టాక్ వస్తే కలక్షన్స్ కంటే థియేటర్స్‌కు కట్టే అద్దె ఎక్కువ అవుతాది - శ్రీను వైట్ల"
సినిమా స్టార్ట్ అయినపుడు పవన్‌కల్యాణ్ ’పంజా’ ఒక క్లాస్ సబ్జక్ట్ అనే ప్రచారంలో వుంది. క్లాస్ సినిమా అంటే భారీ ఓపినింగ్స్ కష్టం. ఒక మాస్ టైటిల్ ద్వారా ఆ ప్రచారాన్ని బ్రేక్ చేసారు.
ఈ మధ్య కాలంలో భారీగా రిలీజ్ అయిన సినిమాలు దూకుడు .. ఊసరవెల్లి. పవన్‌కల్యాణ్ క్రేజ్‌కు మరికొన్ని థియేటర్స్ కలిపి దూకుడు, ఊసరవెల్లి కంటే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆడియో రిలీజ్ అయ్యి, ట్రైలర్స్ ద్వారా పబ్లిసిటీ స్టార్ట్ అయితే భారీ రిలీజ్‌కు కావలసిన హైప్ వస్తుందని నిర్మాతలు ఆశీస్తున్నారు. రెండు నెలల ముందే సినిమా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేయడం ద్వారా ఈ సినిమాపై అభిమానులలో ఉత్సుకతను క్రియేట్ చేయగల్గారు.
0 comments:
Post a Comment