Anjali Lavaniya Performs Belly Dance in
Pawan Kalyan's Panjaa
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘పంజా’ సినిమాకి సంబంధించి ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్ గా వుంది. వీటిలో ఓ పాటను ఈ నెల పది నుంచి హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో చిత్రీకరిస్తారు. కథానాయిక అంజలీ లావనియా తన అందచందాలను ప్రదర్శిస్తూ ఇందులో బెల్లీ డ్యాన్స్ చేస్తుందట. బాలీవుడ్ హిట్ నంబర్ ‘షీలాకీ జవానీ’ కి డ్యాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ గీతా కపూర్ ఇప్పుడీ పాటకు నృత్యాలు కంపోజ్ చేస్తుంది. ఈ పాటను స్పెషల్ సాంగ్ గా అన్ని మసాలాలు గుప్పించి చిత్రీకరించడానికి దర్శకుడు విష్ణువర్ధన్ ప్లాన్ చేస్తున్నాడు. బిల్లా వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ తెలుగు తెరపై సంధిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఇది. నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాతలు. విజయదశమి పండగ సందర్భంగా సినిమా టైటిల్ (పంజా)తో పాటు హీరో ఫస్ట్‌లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో అతని పేరు జాక్సన్ రాబర్ట్ అని తెలుస్తోంది.
"anjalilavania anjalilavania So excited! Gita, the choreographer of Sheila ki jawani is doing d club song for my film. Watch out watch out. Belly dancing in the club;)"
0 comments:
Post a Comment