Sunday, November 6, 2011

Panjaa Audio release on19th Nov

Sakshi Paper artical

పవన్‌కళ్యాణ్ ‘పంజా’ పాటలు ఈ నెల 19న విడుదల కానున్నాయి. పవర్‌స్టార్ సినిమా ఆడియోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పాటల విడుదల కూడా సినిమా విడుదల అంత హడావిడి చేయడం మెగా అభిమానులకు పరిపాటే. ఆ రకంగా ఈ నెల 19 వారికి నిజంగా స్పెషల్! పైగా తొలిసారి పవర్‌స్టార్ సినిమాకు యువన్‌శంకర్‌రాజా సంగీతం అందించారు. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే వండర్ అనిపించేంత హిట్ బాణీలను ‘యువన్’ అందించారని సమాచారం. ‘‘ఇప్పటివరకూ వచ్చిన పవన్‌కళ్యాణ్ సినిమాలకు పూర్తి భిన్నంగా, చాలా స్టయిలిష్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. విష్ణువర్థన్ తనదైన శైలిలో స్టయిలిష్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఉద్వేగపూరితమైన కథ, కథనాలు ఈ చిత్రానికి ప్రధాన బలం. అసారాజేన్ డయాస్, అంజలీ లావానియా కథానాయికలుగా పరిచయమవుతున్నారు. హేమాహేమీలనదగ్గ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఆడియో ఫంక్షన్‌ను అతిరథమహారథుల సమక్షంలో హైదరాబాద్ గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. డిసెంబర్ 9న సినిమా రిలీజ్ చేయబోతున్నాం’’ అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. అడవి శేష్, జాకీష్రాఫ్, అతుల్ కులకుర్ణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, ఝాన్సీ, తనికెళ్ల భరణి పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, యాక్షన్: శామ్‌కౌశల్, ఆర్ట్: సునీల్‌బాలు, స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, సంభాషణలు: అబ్బూరి రవి, స్టైలింగ్: అనూవర్థన్. నిర్మాణం: సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కామీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్.

0 comments:

Post a Comment